ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

కరీంనగర్‌: రామగుండ్‌ంలోని బసంత్‌నగర్‌ కేశవరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో దత్తత గ్రామాల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఫ్యాక్టరీ జాయింట్‌ ప్రెసిడెంట్‌ కపాడియా శనివారం ప్రారంభించారు. స్థానిక బసంత్‌నగర్‌ ఐఎమ్‌ఎస్‌ పాఠశాలలో ఈ కేంద్రం కొనసాగుతుందని ప్రతి బ్యాచ్‌కు 45రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. దత్తత గ్రామాల మహిళలు, యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.