ఉచిత సమ్మర్‌ క్యాంప్‌

చేర్యాల మే 26, (జనంసాక్షి):
సౌత్‌ సెంట్రల్‌ కల్చరల్‌ సెంటర్‌ నాగపూర్‌ వారి ఆధ్వర్యంలో స్తానిక కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్లో సమ్మర్‌ క్యాంప్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నట్లు నఖాషి కళాకారుడు డి నాగేశ్వర్‌ తెలియజేశారు. ఈ సమ్మర్‌ క్యాంప్‌లలో డ్యాన్స్‌,పేయింటింగ్‌, మోడ్రన్‌ ఆర్ట్స్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌ నిర్వహింపబడునని తెలిపారు.ఈ క్యాంపులో పాల్గొనుటకు 9సంవత్సారాల నుంచి 1ి5సంవత్సరాల్లోపు విద్యార్థులు అర్హులు అని తెలపారు. ఈ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు సెంట్రల్‌ జోన్‌ కల్చరల్‌ వారిచే సర్టిఫికెట్స్‌ అందించ బడును. ఈ క్యాంపు మే28నుంచి జూన్‌ 3 వరకు ఉదయం 9-00గంటల నుంచిి11-00 జరుగును. ఆసక్తి గల అభ్యర్థులు మే28లోపు తమ పేరును నమోదు చేయించుకోగలరు వివరాలకై 9949330265,9949330262 నంబర్లతో సంప్రదించ గలరు.