ఉత్తమ పర్యాటక ప్రాంతం హైదరాబాదే!

హైదరాబాద్‌: దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో ఉత్తమ పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్‌ ప్రథమస్థానంలో నిలి,ఇందని ట్రిప్‌     అడ్వైజర్‌ డాట్‌ ఇన్‌ కంట్రీ మేనేజర్‌ నిఖిల్‌ తెలియజేశారు. సెలవుల్ని హైదరాబాదులో గడిపేందుకు దేశ విదేశాల పర్యాటకులు ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు. ఎయిర్‌లైన్స్‌, హోటల్స్‌, విహారాలపై ఈ సంస్థ దేశవ్యాప్త సర్వే నిర్వహించాంది. రాష్ట్రంలో ఉత్తమ పర్యాటక కేంద్రాలుగా గోల్కొండ కోట ప్రధమస్థానంలో, బిర్లామందిర్‌ రెండో స్థానంలో నిలిచాయని, అయితే మొబైల్‌ ద్వారా పర్యాటక వివరాల్ని తెలుసుకోవడంలో హైదరాబాదీలు వెనకంజలో ఉన్నారని నిఖిల్‌ పేర్కొన్నారు.