ఉద్యమంతోనే సాధించుకుంటాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : చర్చలతో కాలయాపన చేయకుండా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు పిలునిచ్చాయి. రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన  రీలేనిరహాదీక్షలు ఆదివారంనాటికి 1008వ రోజుకు చేరుకున్నాయి.  వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజా సంఘాలతోపాటు అన్ని రాజకీయ పార్టీలు తెగించి ఉద్యమిస్తే తప్ప రాష్ట్రం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్ర విషయమై ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటనలు ఇస్తోందని వీటిని ప్రజలు నమ్మె స్థితిలో లేరని వారు పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటామని వారు హెచ్చరించారు.