ఉద్యోగుల, కార్మికుల సంక్షేమానికి కృషి ఆర్టీసి ఎండీ ఎకే ఖాన్‌

చర్చలు సఫలం.. ఎన్‌ఎంయు
హైదరాబాద్‌, జూలై 28 : ఆర్టీసి ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆ సంస్థ ఎండీ ఎకే ఖాన్‌ తెలిపారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఎంయు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సెప్టెంబర్‌లోగా పరిష్కరిస్తామని చెప్పారు. వాటిలో కొన్ని ఆర్థికపరమైనవి కాగా, మరికొన్ని అడ్మినిస్ట్రేషన్‌ పరమైనవని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం అలెవెన్సులను, అదనపు సెలవులను యాజమాన్యం మంజూరు చేసిందని చెప్పారు. ఉద్యోగుల, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు.
చర్చలు సఫలం: ఎన్‌ఎంయు
ఆర్టీసి యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైయ్యాయని ఎన్‌ఎంయు ప్రతినిధి తెలిపారు. కార్మికులకు అదనంగా రెండు సెలవులు, ఉద్యోగులకు మూడు రోజులు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. అలాగే 2,900 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ చేయనున్నట్లు హామీ ఇచ్చారన్నారు. డ్రైవర్లకు విద్యార్హత ప్రకారం కాకుండా సీనియారిటి ప్రాతిపదకనే ప్రమోషన్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు. దీంతో తాము ఇచ్చిన సమ్మే నోటిసును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.