ఉన్నత ప్రమాణాలతో కృషి చేసిన వ్యక్తి సుమన్‌: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఈటీవీ స్థాపన, విస్తరణలో ఉన్నత ప్రమాణాలతో విశేష కృషి చేసిన వ్యక్తి సుమన్‌ అని ఆయన అన్నారు.ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.