ఉపప్రణాళికను ఈ ఆర్థిక సంవత్సరంనుంచే అమలు చేయాలి: భాజపా

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచే  ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టాన్ని అమలు చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లోని పార్టీకార్యాలయంలో బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా కషన్‌రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక బిల్లును కేంద్రప్రభుత్వం ఆమోదంకోసం పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పడు కుంటిసాకులు వెతుకుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 20047 ఎన్నికలకు ముందు ప్రైవేటు రంగంలోను రిజర్వేషన్లు కల్పిస్తామన్న మన్మోహన్‌సింగ్‌ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోనూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.