ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

 

 

 

 

 

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్:నేరేడుచర్ల మండలములోని బూర్గుల తండా గ్రామ పంచాయతిలో జరుగుచున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఎంపీడీవో పి. శంకరయ్య పరిశీలించి పలు సూచనలు చేశారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని, ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలని,కూలీల నమోదు పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి.సత్యనారాయణరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ రజిత తదితరులు పాల్గొన్నారు.