ఉప్పల్ క్రికెట్ స్టేడియం సీజ్:జీహెచ్ ఎంసీ
హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లించనందుకు ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హెచ్ సీఎ 2002 నుంచి జీహెచ్ ఎంసీకి ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సిఉంది. మొత్తం రూ.12 కోట్లను హెచ్ సీఎ .. చెల్లించాల్సి ఉంది. గతవారం జీహెచ్ ఎంసి.. హెచ్ సిఎకు నోటీసులు జారీ చేసింది. కానీ స్టేడియం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆస్తిపన్ను చెల్లింపుకు సంబంధించి.. జీహెచ్ ఎంసీ అధికారులతో హెచ్ సిఎ ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఈనేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లించనందుకు ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని జీహెక్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హెచ్ సీఎ… మ్యాచ్ కు ఐపిఎల్ నుంచి 75 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు.