ఉప ప్రణాళికపై అందరిని కలిసి చర్చించాం

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై రాష్ట్రంలో 20 నుంచి 30 అధికారిక సమావేశాలు నిర్వహించనట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలియజేశారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లుపై చర్చలో ఆయన పాల్గొన్నారు. నాలుగో గోడల మధ్య నివేదిక రూపొందించలేదని, అందరిని కలిసి చర్చించామని చెప్పారు. ఉప ప్రణాళికపై నిర్వహించిన వర్క్‌షాపుల్లో ఎందరో తమ బాధిలు వినిపించారని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత అవసరమని అపుడే వారికి న్యాయం చేకూరుతుందని అన్నారు. వేల కోట్లు కేటాయించినా.. సరైన యంత్రాంగం, పర్యవేక్షక వ్యవస్థ  లేకపోతే వృధాయే అని ఆయన పేర్కొన్నారు.