ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు

శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద
నిజామాబాద్‌,సెప్టెంబర్‌4  జనం సాక్షి    :  ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిజాం సాగర్‌ జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 1405 అడుగుల కాగా, ప్రస్తుత నీటిమట్టం 1403.7 అడుగులు ఉంది.ఇక, నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు ఉంది.నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. మోపాల్‌ మండలంలో 15.7 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది. ఇందల్వాయిలో 14.8, డిచ్‌పల్లిలో 14.2, జక్రాన్‌పల్లి 13.8, సిరికొండలో 13.5 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్‌`బస్వపూర్‌ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. ఇక సిరికొండ మండలంలో కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. గడ్కోల్‌ వద్ద లోలెవల్‌ బ్రిడ్జ్‌పై వాహనాలను అధికారులు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా రాజాంపేట, బీబీపేట, మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మాచారెడ్డి, బిక్కనూర్‌, దోమకొండ మండలాల్లో కుండపోతగా వానపడిరది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గాంధారి మండలంలో 14.4 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది. సదాశివనగర్‌లో 12, జుక్కల్‌లో 11.7 సెంటీవిూటర్ల వర్షం కురిసింది.తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ఉదయం 5 గంటల నుంచి జల్లులు పడుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మోపాల్‌ మండలంలో 15.7 సెంటివిూటర్లు, ఇందల్వాయ్‌లో 14.8 సెంటి విూటర్లు, డిచ్‌పల్లిలో 14.2 సెంటివిూటర్లు, జక్రాన్‌పల్లిలో 13.8 సెంటివిూటర్లు, సిరికొండలో 13.5 సెంటి విూటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల దృష్ట్యా జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్‌`బస్వపూర్‌ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు ఆగిపోయాయి. సిరికొండ మండలంలో ఉద్ధృతంగా కప్పలవాగు ప్రవహిస్తోంది. గడ్కోల్‌ వద్ద లోలెవల్‌ బ్రిడ్జ్‌పై వరద ఉద్ధృతికి
రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ వర్షానికి పలు కాలనీలు జలమయంగా మారాయి. కోరుట్లలో రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.