ఎంఆర్‌పిలకు శిక్షణ

ఒంగోలు ,జూన్‌ 30 : మార్కాపురం డివిజన్‌ స్థాయి ఎంఆర్‌పిలకు స్థానిక మండల విద్యావనరుల కేంద్రం నందు ఒకరోజు శిక్షణా కార్యక్రమం సంసిద్దత కార్యక్రమం ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి సిహెచ్‌పి వెంకటరెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు సంసిద్దత కార్యక్రమాన్ని జులై 31 వరకు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు సి,డి గ్రేడులు వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎ,బి గ్రేడులు వచ్చేలాగా కృషి చేయాలని ఆయన కోరారు. జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ఎం శామ్యూల్‌ మాట్లాడుతూ విద్యార్థులను పాఠశాల వాతావరణానికి అలవాటు పడేలా మరియు 2 నుండి 7వ తరగతి విద్యార్థులకు సంసిద్ధత కార్డులు ఉపయోగించి ఆయా తరగతులకు నిర్ధేశించు లక్ష్యాలు వచ్చులాగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌ అబ్జర్వర్‌ ఎస్‌ఎం మూర్తి, అసిస్టెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ఎన్‌ బాలయ్య, రీసోర్స్‌పపర్సన్‌లు కె సంజీవరావు, ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.