ఎంఐఎం, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటలయుద్ధం నెలకొంది. ఉప ప్రణాళికపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ మైనార్టీ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని మండి పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మజ్లిన్‌ ఉన్నందునే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని అన్నారు, భయపెడితే తాము ఎవరికీ భయపడమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంఐఎం నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల  సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ వల్లే ఎంఐఎం 7 సీట్లు గెలిచిందని గుర్తుచేశారు. దీనిపై ఒవైసీ మాట్లాడుతూ తమ సొంత బలంతోనే గెలిచామని చెప్పారు.