ఎంఐఎం దూరంగా నష్టమేమి లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 15 : ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ నుంచి వీడిపోవడం నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ రాజకీయ దుర్దేశంతోనేనని  ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నుండి దూరంగా ఉండడం బాధాకరమని అన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీని మతతత్వ పార్టీగా ఆరోపించిన అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలను ఖండించారు.  కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే 20 సూత్రాల పథకం అమలు, మైనార్టీలకురిజర్వేషన్లు తదితర పథకాలు అమలు చేసిందని అన్నారు. ఎంఐఎం ప్రభుత్వానికి దూరంగా ఉండడం వల్ల కాంగ్రెస్‌కు నష్టమేమిలేదని ఆయన పేర్కొన్నారు. యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే మైనార్టీలో పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.