ఎంపీ రవిచంద్ర కు గణపతి లడ్డు బహుకరించిన సీఈఓ సుమన్ గౌడ్
దంతాలపల్లి సెప్టెంబర్ 11 జనం సాక్షి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అహల్య గ్రూప్ సీఈవో జలగం సుమన్ గౌడ్ గణపతి లడ్డును ఆదివారం హైదరాబాదులోని ఎంపీ రవిచంద్ర నివాసంలో తన సోదరి మండలంలోని బొడ్లాడ గ్రామ సర్పంచ్ మండ సుష్మ గౌడ్ తో కలిసి బహుకరించారు. బంజారా హిల్స్ లో శ్రీ వెంకటేశ్వర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి లడ్డు రెండు లక్షల 26 వేలకు వేలంపాటలో దక్కించుకొని బహుకరించగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారన్నారు.