ఎక్సైజ్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: ప్రజల రక్తాన్ని మద్యంగా మార్చి ఖజానా నింపుకొందామని యోచిస్తున్న ప్రభుత్వాల తీరును ప్రజాసంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఖండించింది. ఎక్సైజ్‌ పాలసీని మార్చాలని అంచెలంచెలుగా నిషేధాన్ని అమలుచేయాలని కోరుతూ వేదిక నాయకులు హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ముట్టండించారు.కొత్త ఎక్సైజ్‌ విధానం అమలుకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా దానిపై స్పష్టమైన  ప్రకటన కానీ,మంత్రివర్గ ఉపసంఘం నివేదిక కానీ వెల్లడించకపోవడాన్ని వారు అక్షేపించారు. కొత్త విధానాన్ని రూపొవదించే ముందు ప్రతిపక్ష పార్టీలు, మహిళలు, యువజన సంఘాలతో చర్చించాలని వారు  తెలిపారు.