ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలి

ఖమ్మం: ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేసే బాద్యత పోలీస్‌, ఎక్సైజ్‌లతో పాటు గ్రామ పంచాయితీలకు కూడా చట్టబద్దంగా అప్పగించేవందుకు సంస్కరణలు చేపట్టాలని అన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు లోక్‌సత్తా విశేషంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా పార్టీ బలోపేతానికి ఈనెల 3 నుంచి 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత  కార్యక్రమాలు  చేపట్టనున్నట్లు తెలిపారు. అపారమైన అనుభవం ఉన్న ప్రణబ్‌కు రాష్ట్రపతి పదవి చేపట్టేందుకు లన్ని అర్హతలున్నాయని అయితే సంగ్మా కూడా అందుకు సమర్థుడేనని వ్యాఖ్యానించారు. సంప్రదాయ పార్లీలన్నీ అవినీతిని పెంచి పోషించడంతో అవినీతిపరులు కూడా ప్రజాప్రతినిధులు కావాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.