ఎక్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

గడ్చిరోలి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పావిమురాండ ఆటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. గాయపడిన పోలీసులను నాగపూర్‌ ఆస్పత్రికి తరలించారు. పావిమురాండ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.