ఎడ్లబండిని డీకోన్న లారీ స్తంబించిన రాకపోకలు

 

పరిగి ఎడ్లబండిని లారీ ఢీకోనడంతో పరిగి, మహబూబ్‌నగర్‌ మార్గంలో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన పరిగి పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌, రాఘవపూర్‌ గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. దీంతో ఒక కాడెద్దు అక్కడికక్కడే చనిపోగా మరోకటి ప్రాణాపాయ ష్థితిలో ఉంది. కోల్కచెర్ల మండలం అల్లాపూర్‌ తండాకు చెందిన సేవ్యా నాయక్‌ పరిగి సంతకు ఎద్దులబండిపై వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకోంది.రైతుకుస్వల్ప గాయాలయ్యాయి దీంతోఅగ్రహించిన తండావాసులు నడిరోడ్డుపైనే అందోళనకు దిగడంతో వాహనల రాకపోకలు నిలిచిపోయాయి. అలస్యంగా చేరుకున్న పోలిసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.