ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు.

బీసీ ప్రధాన మంత్రిగా ఉన్నారన్నారు. మేము అనని మాటలను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్‌కు కాంగ్రెస్‌ ఎసరు పెట్టిందని ధ్వజమెత్తారు. మా మేనిఫెస్టోలోని అంశాలను కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది ఇన్నేళ్లు అధికారంలో ఉండి బీసీని ప్రధానిని చేశారా? అంటూ ప్రశ్నించారు.

ఓడిపోతే తన కుర్చీకి ఎసరు వస్తోందని రేవంత్‌ అబద్దాలు చెబుతున్నారు. రేవంత్‌ తన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. బీజేపీని చూసి కాంగ్రెస్‌ కాళ్ల కింద కుర్చీ కదులుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలవబోతున్నాం. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రేవంత్‌ పీఠం కదలడం ఖాయం” అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.