ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్‌ మృతి

కరీంనగర్‌: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీషీటర్‌ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్‌హౌస్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ కట్టెకోల సుధీర్‌(24) కరీంనగర్‌,గోదావరిఖనిలో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితుడు.సప్తగిరి కాలనీలో చికెన్‌ వ్యాపారిపై దాడి చేయడంతో సుధీర్‌ గ్యాంగ్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు.ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సుధీర్‌ రాజేశ్‌ ధీయేటర్‌ సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు.సుధీర్‌ గమనించి వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు.పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే సుధీర్‌ మృతి చెందాడు.అనతరం పోలీసులు మృతదేహం వద్ద తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలిని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.