ఎమ్మార్‌ ఎండీని విచారించిన సీబీఐ అధికారులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు, ఎమ్మార్‌, ఎంజీఎఫ్‌ సంస్థ ఎండీ శ్రావణ్‌గుప్తా ఈ రోజు దిల్‌కుశా అతిధిగృహంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. నాలుగు గంటలపాటు ఆయనను అధికారులు విచారించారు. ఎమ్మార్‌ విల్లాల క్రయవిక్రయాలపై వివరాలు తెలుసుకున్నారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఆయనను సీబీఐ విచారించనుంది.