ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన భిక్షపతి

హైదరాబాద్‌ : గులాబి దళంలో మరో సైనికుడు చేరాడు. ములుగురి భిక్షపతి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించి సీమాంధ్ర పెట్టుబడి దారులకు బుద్ధి చెప్పిన పరకాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఈటెల రాజేందర్‌, ఉపనేత హరీష్‌రావు, కేటీఆర్‌ తదితరులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.