ఎమ్మెల్యేల బృందానికి బిందెలతో స్వాగతం

నల్గొండ: ఫోరైడ్‌ సమస్యపై అధ్యయనం చేయడానికి వచ్చిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందానికి మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. నిన్న రాత్రి నాగార్జునసాగర్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల బృందం ఈ ఉదయం పుట్టంగండిప్రాజెక్టు వద్దకు వచ్చాయి. అయితే గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేల ముందు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. స్పీకర్‌ వెంటనే సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడారు.