ఎమ్మెల్యే ఇంట్లో భారీ చోరీ

ఒంగోలు: కొండపి ఎమ్మెల్యే జీవీ శేషు ఇంట్లో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి ఒంగోలు పట్టణం క్లౌపేటలోని ఎమ్మెల్యే ఇంటి వెనకద్వారం పగలగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. రూ. 20 లక్షల నగదు, రూ. 6 లక్షల విలువైన బంగారాన్ని దొచుకెళ్లారు. చోరీ జరిగినట్లు సోమవారం తెల్లవారుజామునగుర్తించిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ ఎం. రజనీకాంత్‌రెడ్డి. సీఐలు కాసింబేగ్‌, శ్రీనివాస్‌ ఘటనాస్థలికి క్లూస్‌టీంతో చేరుకొని విచారణ చేపట్టారు.