ఎమ్మెల్యే గంగులది అవగాహనారాహిత్యం

కరీంనగర్‌, జూన్‌ 8 (జనంసాక్షి) :

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

నాయకులు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధికార ప్రతినిధి గడ్డం విలాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2001 నాలా యాక్ట్‌ ప్రకారం ఎడ్యుకేషనల్‌ సొసైటీలకు పన్ను మినహాయింపు ఉంటుం దని, ఆ మినహాయింపు చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ కూ వర్తిస్తుందని, అయితే ఈ చిన్న విషయం కూడా కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కమలా కర్‌ అవగాహనారాహిత్యానికి ఇది నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయ కులు  మునీందర్‌, జక్కని ఉమా పతి, కల్పన రవీందర్‌, సర్దుల్‌ సింగ్‌,పాల్తెపు కిషన్‌, పోకల లక్ష్మీనారాయణ, సింగిరెడ్డి రాంరెడ్డి, ప్రమోద్‌రావు, ముగ్దుం అలీ, తాళ్లపల్లి అంజయ్యగౌడ్‌, ముక్క భాస్కర్‌, కేటీ స్వామి, సుంకరి గణపతి తదితరులు పాల్గొన్నారు.

‘కమలాకర్‌ ! కువిమర్శలు మానుకో’ : మహ్మద్‌ ఫజలుద్దీన్‌
చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థపై స్థానిక శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నగర కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ ఫజలుద్దీన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కమలాకర్‌ ఆరోపణలు చేశారన్నారు. రాజకీయంగానే కాకుండా వైద్యవిజ్ఞాన సంస్థ ద్వారా నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్న ఆ ఆస్పత్రి అధినేత చల్మెడ లక్ష్మీనర్సింహారావుపై కమలాకర్‌ బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో పేదలకు నామమాత్రపు ఫీజులతో మెరుగైన వైద్య సేవలందిస్తూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు, మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న విషయం ఎమ్మెల్యేకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా కువిమర్శలు మానుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఫజలుద్దీన్‌ హెచ్చరించారు