ఎమ్మెల్సీల అనర్హతపై స్వామిగౌడ్‌కు వినతి
హైదరాబాద్,ఫిబ్రవరి16జనంసాక్షి : అనర్హత పిటిషన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు సోమవారం మండలి చైర్మన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పార్టీ ఫిరాయించిన తొమ్మిదిమంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి మండలి ఛైర్మన్ను కలిశారు. ఎమ్మెల్సీల అనర్హతపై కోర్టు జోక్యం చేసుకోనందని, అందుకే మరోసారి ఛైర్మన్ను కలిసి ఎమ్మెల్సీలపై వేటు వేయాలని కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్రావు సోమవారమిక్కడ తెలిపారు. ఇప్పటికే కోర్టులో కేసు వేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు మరోమారు ఛైర్మన్‌ను కలసి ఒత్తిడి పెంచారు. అయితే చైర్మన్ నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రభాకర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల మద్దతుతో స్వామిగౌడ్ చైర్మన్ స్థానంలో కూర్చున్నారని ధ్వజమెత్తారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ప్రభాకర్ అన్నారు. ఏడు నెలలుగా తమ విచారణ పిటిషన్ను చైర్మన్ పట్టించుకోవడం లేదని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల ఓట్లతోనే ఛైర్మన్గా స్వామిగౌడ్ గెలిచారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ డైరెక్షన్ మేరకే మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ప్రభాకరరావు ఆరోపించారు. నెల రోజుల్లో ఫిరాయింపుల ఎమ్మెల్సీల పదవీ కాలం గడువు ముగుస్తుందని, ఈలోగా ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసి ఛైర్మన్ హుందాగా, నైతికంగా వ్యవహించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీల వివరణకు మరో నెల రోజుల గడువు ఇవ్వడం సరికాదన్నారు.