ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్

uyzd27s6
హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతోన్న ఎన్నికల్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీకి చేరుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్ కు వెళ్లి ఓటు వేశారు. మండలిలోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.