ఎమ్ ఆర్ ఓ ,మున్సిపల్ చైర్మన్ కు ఘన సన్మానం

ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ ముస్లిమ్ జె ఏ సి ఆధ్వర్యంలో
ఖానాపూర్ రూరల్ 17 ఆగష్టు జనం సాక్షి : ఖానాపూర్ ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ ముస్లిమ్ జె ఏ సి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ మోహన్ 15 ఆగష్టు రోజు ఉత్తమ తహశీల్దార్ అవార్డ్ అందుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ కు కూడా ఉత్తమ చైర్మన్ అవార్డ్ వచ్చిన సందర్భంగా ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ, ముస్లిమ్ జె ఏ సి ఆధ్వర్యంలో ఇరువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖళీల్ ,ముస్లిమ్ జె ఏ సి అధ్యక్షులు షబీర్ పాషా,ముస్లిమ్ నాయకులు కెహెచ్ ఖాన్,నసిర్,సలీమ్,షోయబ్,ఇర్ఫాన్,కైసర్,ఆయుబ్,షర్ జిల్ పాల్గొన్నారు.