ఎరువుల కోసం అధికారులను నిలదీసిన రైతులు

మంథని: ఎరువుల కొరత తీర్చాలంటూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు మంథని ఆర్డీవో కార్యలయాన్ని ముట్టడించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న అధికారులను ఎరువుల కొరతపై నిలదీశారు. రోజుల తరబడి తిరుగుతున్నా ఎరువులు లభించటం లేదని, పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసామాధికారి యోగిత హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.