ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని

న్యూఢిల్లీ: 66వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకు ముందు ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, సహాయ మంత్రి పళ్లంరాజు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని త్రివిధదళాల గౌరవ వందనం స్వీకరించారు.