ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం : కిషన్రెడ్డి
హైదరాబాద్: అన్ని ప్రభుత్వాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయిందన్నారు. 70 శాతం దళితవాడల్లో తాగునీటి కొరత ఉందని తెలియజేశారు. నాలుగున్నర వేల దళిత వాడలకు విద్యుత్ సౌకర్యం లేదని ఆయన చెప్పారు.



