ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఏప్రిల్ 6 : జానకీపురం ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. సోమవారం కామినేని ఆస్పత్రికి వెళ్లిన ఆయన సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదే ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధయ్య భార్యను కూడా కేసీఆర్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఆమెను కేసీఆర్ ఓదార్చారు.