ఎస్‌ఐ మధుసూధన్‌కి పోలీసుల నివాళి

నల్లగొండ,మార్చి5(జ‌నంసాక్షి):  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోచంపల్లి ఎస్సై మధుసూదర్‌ మృతదేహానికి ఉన్నతాధికారులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో నివాళులర్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, జిల్లా ఎస్పీ రంగనాథ్‌, సీఐలు, డీఎస్పీలు, ఇతరు అధికారులు పాల్గొన్నారు. ఎస్సై కుటుంబ సభ్యులను అధికారులు పరామర్శించారు. ఆయన సేవలను కొనియాడారు. ఆయన మృతి శాఖకు తీరని నష్టమని అన్నారు.