ఎస్.జి. ఎఫ్. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన షోటొఖాన్ కరాటే విద్యార్థి బేర ఆదిత్య తేజ

మంథని, (జనంసాక్షి) : నల్గొండ జిల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 5,6,7 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మంథని పట్టణానికి చెందిన జపాన్ కరాటే అసోసియేషన్, షోటొఖాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇనిస్ట్రక్టర్ కోoడ్ర నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ముగ్గురు విద్యార్థులు పాల్గొని అత్యధిక ప్రతిభ ను కనబరచి న్యూ ఢిల్లీలో ఈ నెల 14 నుండి 19 తేదీలలో జరగబోయే ఎస్. జి. ఎఫ్. జాతీయ స్థాయి కరాటే పోటీలకు అండర్ 17, -35 కె. జి.విభాగంలో బేర ఆదిత్య తేజ గోల్డ్ మెడల్ సాధించి ఎంపిక కావటం జరిగింది. అలాగే అండర్ 14, -42 కె. జి విభాగంలో వడ్లకొండ శ్రీ నిత, అండర్ 17, -52 కె.జి విభాగంలో దొంతుల సాయి దివ్య తేజస్విని సిల్వర్ మెడల్స్ సాధించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులను నల్గొండ జిల్లా కలెక్టర్ అర్.బి కన్నన్ , జే.కె. ఏ సౌత్ జోన్ ఇంఛార్జి రాపోలు సుదర్శన్ , షోటోఖాన్ కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బానయ్య, పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఎఫ్ సెకరేట్రి కోమురోజు శ్రీనివాస్ , సీనియర్ కరాటే మాస్టర్లు పర్శ బక్కయ్య, శంకర్ గౌడ్ , పెద్దపల్లి జిల్లా కరాటే అసోసియేషన్ మాస్టర్లు కరాటే అభినందించారు.