ఏపీపీఎస్సీ గ్రూప్‌-1

మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
దిద్దుబాటు కార్యక్రమంలో భాగం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆదివారం అత్యవసరంగా భేటీ అయిన ఏపీపీఎస్సీ సభ్యులు ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు దొర్లడంపై చర్చించి మెయిన్స్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ నెల 16నుంచి మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష వాయిదలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఈనెల 5నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. మెయిన్స్‌కు ఇదివరకే ఎంపిక చేసిన 16వేల 426మందికి అదనంగా మరో 1201మందిని తాజాగా తయారు చేసిన కీ ఆధారంగా ఎంపికచేసినట్లు మాలకొండయ్య తెలిపారు.