ఏప్రిల్‌ 25న రామలింగేశ్వరాలయం ప్రారంభం

share on facebook

యాదాద్రి,మార్చి4 (జనం సాక్షి ) : భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్‌ 25న తిరిగి ప్రారంబించనున్నారు. తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వావిూజీ దీనికి ముహూర్తం ఖరారు చేసినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ 21న శివాలయ ఉద్ఘాటనకు అంకురార్పణ జరిపి 25న శివాలయాన్ని పునఃప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజుల్లో తొగుట పీఠాధిపతి దగ్గరకు వెళ్లి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐదురోజులపాటు నిర్వహించే హోమాలు, మూల మంత్రాలు, పూజల విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 18న శివాలయ ధ్వజస్తంభం, కర్రలు, ఇత్తడి కలశాలు, తొడుగులకు శుద్ధి పూజలు చేశారు.

Other News

Comments are closed.