‘ఏరియర్స్‌లో అడ్వాన్స్‌ను మినహాయించొద్దు’

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి):

సింగరేణి ఏరియర్స్‌లో కార్మికులకిచ్చిన సకల జనుల సమ్మె కాలంలో అడ్వాన్స్‌ను మినహాయించే ప్రయత్నంలో ఉందని… ఏఐటియుసి నేత వాసి రడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం స్థానిక సింగరేణి ఇల్లందు క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఇచ్చిన రూ.25వేల అడ్వాన్స్‌ రద్దు విషయంలో తెలంగాణ జేఏసీి పూనుకోవాలని ఆయన కోరా రు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన స్పెషల్‌ లీవ్‌ తరహాలో సింగరేణి కార్మికులకు ఈ అవకా శాన్ని కల్పించాలని ఆయన కోరారు. సకలజనుల సమ్మెలో ప్రధాన భూమికను పోషించిన సింగరేణి కార్మికుల విషయంలో జేఏసీి నాయకులు కోదం డరాం, టిఆర్‌ఎస్‌ నేత కేసిఆర్‌ ఇచ్చిన హామీ మర వకూడదని… కార్మికులకు నష్టం కలగకుండా చూడాల్సిన బాద్యత టిజేఏసీిపై ఉందన్నారు. కాగా, ఏఐటియుసిని విమర్శించే హక్కు హెచ్‌ఎం ఎస్‌కు లేదన్నారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ది లేని హెచ్‌ఎంఎస్‌ సింగరేణి కార్మికుల ముందు తెలం గాణ పట్ల మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. సకలజనుల సమ్మెలో రైల్వేలో గుర్తింపు సంఘంగా ఉన్న హెచ్‌ఎంఎస్‌ సమ్మె చేయించకుండా దూర ముందన్నారు. కార్మికులకు ఎన్నో హక్కులను సాధించిపెట్టిన ఘనత తమ సంఘానికి ఉందన్నా రు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మిర్యాల రంగయ్య, ఎం.దయాకర్‌రెడ్డి, వేల్పుల నారాయణ, షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.