అడ్రసు లేని ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ బిల్లులు రాక లబోదిబో మంటున్న కూలీలు

శాయంపేట జూన్‌ 19, (జనంసాక్షి) : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రవీణ్‌ కుమార్‌ గత నెల నుంచి ఆయన వ్యక్తిగత కార ణాల వలన సెలవు మీద వెళ్లిపోయారు.  దాం తో శాయంపేట మండల కేంద్రంలోని 100 రో జుల ఉపాధి హామీ పథకం క్రింద పనిచేసిన కూ లీలకు రావలసిన నగదు ఈజిఎస్‌చెక్‌ మేజర మెంటు బిల్లులు అన్నీ నెల రోజుల నుంచి ఆగి పోయినాయి.  ఇది ఇలా ఉన్నప్పటికి స్థానిక ఎం పిడిఓ బి.భద్రు, ఎపిఓ మాధవిలు అతనిపై చర్య తీసుకోకుండా, అతని స్థానంలో వేరొకరిని నియ మించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రు.  గత నెల రోజుల నుంచి  పనిచేసిన డబ్బు లు ఏవని కూలీలు ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ను అడుగగా వారు మొఖం చాటేస్తున్నారు.  దీంతో కూలీలు లబోదిబో మంటూ మండల కార్యాలయము చు ట్టూ తిరగలేక వాపోతున్నారు.  ఇప్పటికైనా సం బంధిత మండల ఉపాధి హామీ పథకం అధికా రులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి.