ఏసీబీ వలలో చిక్కిన పెద్ద అవినీతి చేప

కరీంనగర్‌: జిల్లాలో అవినీతి చేప ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కింది. కోరుట్ల టౌన్‌ ప్లానింగ్‌ అఫిసర్‌గా పనిచేస్తున్న రాజు ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు చిక్కాడు. ప్రతి నెల సమారు 6లక్షలకు పైగా లంచాల రూపంలో అక్రమంగా సంపాదిస్తున్నడు. ఎంతో మంది ఏసీబీ అధికారుల ముందే లంచాలు ఇవ్వటానికి వచ్చారు. ఎన్నో రోజులుగా ఇలా ప్రజల దగ్గరి నుంచి సోమ్మును అప్పనంగా లాగేసుకుంటున్నాడు. డీఎస్పీ సుధర్శన్‌, సీబీఐ ఇన్స్‌పెక్టర్‌ రమణమూర్తి జరిపిన ఈ దాడిలో అవినీతి తిమింగలం రాజు చిక్కాడు.