ఐఎంఏ సమావేశంలో తెలంగాణ నినాదాలు

వరంగల్‌ : జిల్లాలోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఐఎంఏ అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య నల్లబ్యాడ్జీతో హాజరయ్యారు. అంతకు ముందు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి.