ఒలింపిక్స్‌లో 8మంది బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల బహిష్కరణ
లండన్ : ఒలింపిక్స్‌లో 8 మంది మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులపై నిర్వాహకులు వేటు వేశారు. మహిళల డబుల్స్ జరిగిన మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వీరిపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో కమిటీ విచారణ జరిపింది. దక్షిణ కొరియాకు చెందిన రెండు టీములు, చైనా, ఇండోనేసియాకు చెందిన ఒక్కో టీమును బహిష్కరిస్తున్నట్టు నర్వాహకులు వెల్లడించారు.