ఒలింపిక్‌ క్రీడలకు రక్షణగా క్షిపణి సాంకేతికత వినియోగం

లండన్‌:ఒలింపిక్స్‌కి రక్షణగా బ్రిటన్‌ క్షిపణి సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తోంది.విమానాల దాడుల్ని సమర్థంగా ఎదుర్కొనడానికి క్షిపణులను సిద్దంగా ఉంచుకోవాలని ఆ దేశ అంతర్గత భద్రతా వ్యవహరాల మంత్రిత్వశాఖ భావిస్తోంది.అందుకుగాను ఒలింపిక్‌ పార్కు చుట్టూ మాత్రమే కాక సమీపంలోని నివాస భవనాల పై బాగంలోనూ కొన్ని క్షిపణులను ఏర్పాటు చేయబోతున్నారు.అయితే ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడోత్సవం ఇది.దీని నిర్వహణ ఎంత ప్రతిష్ఠాత్మకమో అంత బాద్యతయుతమైంది కూడా అందుకే భద్రతా వ్యవస్థ పట్ల రాజీ పడదలచుకోలేదు అన్నది విమర్శకులకు మంత్రి థెరెసా మే సమాదానం