ఓఎంసీ, ఎమ్మార్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమ ఆస్తులు, ఓఎంసీ ఎమ్మార్‌ అక్రమాల కేసుల్లో అరెస్టయిన నిందితులకు సీబీఐ కోర్టు ఆగష్టు 1వరకు రిమాండ్‌ పొడిగించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాదద్‌, బ్రహ్మానందరెడ్డిలను చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ కోర్టు న్యాయమూర్తి దుర్గా&ప్రసాదరావు విచారించారు. ఓఎంసీ కేసులో బెంగళూరు జైలు నుంచి గాలి జనార్థన్‌రెడ్డి చంచల్‌గూడ నుంచి బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఎమ్మార్‌ కేసులో కోనేరు ప్రసాద్‌, సునీల్‌రెడ్డి, బీపీ ఆచార్యలను న్యాయమూర్తి వివరించారు. శ్రీలక్ష్మీ, విజయరాఘవులనుజైలు అధికారులు నేరుగా కోర్టులో హజరుపరిచారు. వీరందరికీ ఆగష్టు 1వరకు రిమాండ్‌ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.