ఓఎంసీ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంపీ కేసులో ముగ్గురు నిందితులకు సీబీఐ న్యాయస్ధానం రిమాండ్‌ పొడిగించింది. గాలి జనార్థన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మార్‌ కేసులోనూ బీపీ ఆచార్య సునీల్‌రెడ్డిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్‌ పొడిగించింది.