ఓటర్లుగా పేరు నమోదు చేసుకోండి : ఎన్నికల నిఘావేదిక సూచన

హైదరాబాద్‌: రేపటి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలని, జాబితాల్లో తప్పులుంటే సవరించుకోవాలని ఎన్నికల నిఘావేదిక కోరింది. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు  నిఘావేదిక హైదర్‌గూడ ఎన్‌ఎన్‌ఎస్‌ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో జస్టిన్‌ అంబటి లక్ష్మణరావు, జనచైతన్యవేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ్‌రెడ్డి, సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటుహక్కు ఉపయోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అంబటి లక్ష్మణరావు తెలిపారు. ఓటుహక్కుపై అవగాహన  కల్పించేందుకు మీడియా, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేయాలని సఘావేదిక సభ్యులు కోరారు.