ఓటు వినియోగించుకున్న అభ్యర్థులు

కాంగ్రెస్‌, వైఎస్సార్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన బరిలో ఉన్న అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభ దశలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి ధర్మాన రామదాస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి ధర్మాన కృష్ణదాసులు వారి స్వగ్రామమైన మబగాంలో ఓటును వినియోగించుకోగా, తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి స్వామిబాబు తన స్వగ్రామమైన మాకివలసలో ఓటు వేశారు.