ఓటు వేసింది లోటస్ పాండ్ లో కూర్చొవడానికా – బోండా ఉమ..

విజయవాడ :జగన్ కు ప్రజలు ఓటు వేసింది లోటస్ పాండ్ లో కూర్చొవడాని కాదని టిడిపి నేత బోండా ఉమ పేర్కొన్నారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావాలని సూచించారు. స్పీకర్ తన విచక్షణాధికారాలు ఉపయోగిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభా నియమాలు పాటించాలని సూచించారు. రోజా వాడుతున్న భాష తాటకి, శూర్పణఖ, మహిళా రాక్షసులను తలపిస్తోందని పేర్కొన్నారు. కొడాలి నాని వీధి రౌడీలా మాట్లాడడం సరైంది కాదన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు.