ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కాలపరిమితి ముగిసినా ఖాళీచేయలేదని పోలీసుల సహకారంతో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. మహిళా హాస్టళ్లలో కరెంటు, నీటి వసతిని ఓయూ సిబ్బంది తొలగించారు.