ఓ ప్రజాప్రతినిధినే బెదిరించిన ఇసుక మాఫియా

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ ప్రజాప్రతినిధినే బెదిరించారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.  మక్తల్‌ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డిని ఇసుక మాఫియా బెదిరించింది. దీంతో ఎమ్మెల్యే దేవరకద్ర పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. ఇసుక వ్యాపారి పాండ్యానాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.